మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రవితేజకు ఇటీవల సరైన సక్సెస్ లేదు. టచ్ చేసి చూడు, నేల టికెట్టు లాంటి చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో రవితేజ తదుపరి చిత్రంతో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే రవితేజ మార్కెట్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. 

ఇలాంటి తరుణంలో డిస్కోరాజా చిత్రం రవితేజ కెరీర్ కు కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ముందుగా డిస్కోరాజా చిత్రాన్ని డిసెంబర్ 20న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ క్రిస్టమస్ బరిలో నిలిచిన చిత్రాలు ఎక్కువయ్యాయి. అనవసరమైన పోటీ ఎందుకని భావించారో ఏమో కానీ డిస్కోరాజా చిత్ర విడుదుల తేదీ మారింది. 

ఈ చిత్రాన్ని జనవరి 24, 2020 తేదీన రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సోలోగా రావడమే బెటర్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. అదేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

వరుస చిత్రాలతో దూసుకుపోతున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రామ్ తాళ్లూరి డిస్కోరాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిస్కో రాజా తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని దర్శత్వంలో నటిచబోతున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా ఎంపికైంది.