మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడోసారి వస్తోన్న సినిమా 'క్రాక్'. మరోసారి కలిసిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం 'క్రాక్' మూవీని మే 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అయితే రవితేజ అలోచించి ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన డిస్కోరాజా సైతం మాస్ రాజా కెరీర్ మరో డిజాస్టర్ గా నిలిచింది. అయితే నెక్స్ట్ క్రాక్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మాస్ రాజా రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ జోరు అయితే గట్టిగానే పెరిగింది. అయితే సమ్మర్ లో సినిమా డేట్ ని రిలీజ్ చేయడానికి అసలు కారణం క్రాక్ రిలీజ్ అవుతున్న సమయంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు.

దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో వెహికిల్ నుంచి బయటకు వస్తూ, బదాస్ గా కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తోన్న 'క్రాక్'లో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాల మేళవింపుతో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తయారవుతోంది.

రెండు శక్తిమంతమైన పాత్రల్ని తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్ కుమార్ పోషిస్తున్నారు. మరీ ఈ సినిమాతో రవితేజ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.   సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 'మెర్సాల్', 'బిజిల్' వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు 'క్రాక్' కు డీఓపీగా పనిచేస్తున్నారు.