ప్రస్తుతం కరోనా ప్రభావంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాల రిలీజ్‌లు, షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలకు బ్రేక్ పడటంతో సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో అభిమానులను అలరించేందుకు తారలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. గతంలో అడపాదడపా మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపించే తారలు. ఇప్పుడు వరుసగా ట్వీట్ లు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

గతంలో పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించని రవితేజ, లాక్ డౌన్‌ కారణంగా సమయం దొరకటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతున్నాడు. లాక్‌ డౌన్‌ సమయంలో తాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు వరుసగా అభిమానులతో పంచుకుంటున్నాడు. కొడుకు కూతురితో సరాదాగా కాలం గడుపుతున్న ఫోటోలతో పాటు వర్క్ అవుట్‌ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాడు.

తాజాగా తన కొడుకు మహాధన్‌ తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన రవితేజ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. తన పక్కన కూర్చొనిసెల్‌ ఫోన్ చేస్తున్న కొడుకును రవితేజ చూస్తున్న ఈ ఫోటోతో పాటు `చెకింగ్‌ ఆన్‌ మై డీఎన్‌కె (నా దొంగ నా కొ** ని చెక్ చేస్తూ)` అంటూ కామెంట్ చేశాడు. ఇటీవల డిస్కోరాజా సినిమాతో నిరాశపరిచిన రవితేజ, ప్రస్తుతం క్రాక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Checking on my DNK 🤨

A post shared by RAVI TEJA (@raviteja_2628) on Apr 26, 2020 at 2:51am PDT