రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో నెల టిక్కెట్టు ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా 2018లో వచ్చిన ఆ సినిమా రిలీజ్ అనంతరం ఎవరు ఊహించని రిజల్ట్ ని అందుకుంది. రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో అప్పుడే సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తరువాత చేసిన చిత్రం అది. ఇక దర్శకుడు కళ్యాణ్ కృష సోగ్గాడే చిన్ని నయన తరువాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచినప్పటికి మొదటీషోకే సినిమా రిజల్ట్ తెలిసిపోయింది.

అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ అందరికంటే ఎక్కువగా హీరోయిన్ పైనే పడింది. సెంటిమెంట్ ని ఎక్కువగా ఫాలో అయ్యే చాలా మంది నిర్మాతలు మాళవిక శర్మను పట్టించుకోలేదు. నేల టిక్కెట్టు కంటే ముందే డిస్కర్షన్స్ లో ఉన్న ప్రాజెక్టులు సైతం అమ్మడి చేతివరకు వచ్చి మిస్ అయ్యాయి. మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలవడంతో ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఆ యంగ్ హీరోయిన్ కి మంచి బూస్ట్ ఇవ్వాలని రవితేజ మరొక అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. అందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాలో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా సెట్టవ్వగా చిత్ర యూనిట్ మరొక హీరోయిన్ కోసం సెర్చ్ మొదలుపెట్టింది. దీంతో రవితేజ నిర్మాతలను రిక్వెస్ట్ చేసి మాళవికకు అవకాశం ఇవ్వాలని చెప్పాడట. నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి మాళవిక ఈ గోల్డెన్ ఛాన్స్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.