గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సారి హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సైన్స్ ఫిక్షన్ కథలో రెడీ అవుతున్నాడు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మాస్ రాజా సినిమాకు సంబంధించిన టీజర్ తో త్వరలోనే అభిమానులను పలకరించనున్నాడు.

ఇక దసరా సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవితేజ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ నెల 19న సినిమా మొదటి పాటను రిలీక్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్ విషయంలో థమన్ సరికొత్తగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డిస్కో రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలుస్తుందట.

విఐ.ఆనంద్ ఈ సినిమాను రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం డిస్కో డాన్స్ లతో యూత్ కు కిక్ ఎక్కిస్తూ డిస్కోకింగ్ గా పేరు తెచ్చుకుంటాడు రవితేజ. రాజకీయనాయకుడితో గొడవ కారణంగా కోమాలోకి వెళ్లిన హీరో దాని నుండి బయటపడ్డ తరువాత తన రివెంజ్ ఎలా తీర్చుకుంటాడనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.