ఒకప్పుడు టాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాలు బాగా వచ్చేవి. కానీ రానురాను వాటి సంఖ్య తగ్గింది. ఆ తరువాత మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మొదలయ్యాయి.

వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన 'ఎఫ్ 2' ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. రీసెంట్ గా వెంకీ, చైతు కలిసి నటించిన 'వెంకీమామ'కి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ హీరో కాంబినేషన్ లో సినిమాలు వస్తుంటే అవి సూపర్ హిట్స్ అవుతున్నాయి.

బాలకృష్ణ 'రూలర్' రివ్యూ..!

ఈ కోవలోనే మాస్ రాజా రవితేజ, మెగాస్టార్ మేనల్లుడు సాయి తేజ్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తోంది. దీనికి కారణం తాజాగా సాయి తేజ్ చేసిన వ్యాఖ్యలే.. మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ నటించిన 'ప్రతిరోజు పండగే' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్టీస్టారర్ల గురించి మాట్లాడాడు తేజు.

తనకు ఈ తరహా సినిమాలు చేయడమంటే ఇష్టమని చెప్పాడు. వరుణ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయాలనే ఆసక్తిని బయటపెట్టాడు. బయట హీరోల విషయానికొస్తే.. రవితేజతో తెరను పంచుకోవాలనుందని చెప్పాడు. తమ మధ్య ఎన్నో సార్లు ఈ డిస్కషన్ కూడా వచ్చినట్లు చెప్పాడు. రవితేజని కలిసిన ప్రతీసారి మనిద్దరం కలిసి ఓ సినిమా చేయాలబ్బాయ్ అని అంటుంటాడని.. ఆ అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తేజు చెప్పాడు.

యాభై ఏళ్లు దాటినా ఇప్పటికీ రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తుంటాడు. ఇక తేజు చాలా జోవియల్ గా ఉంటాడు. వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి వీరి ముచ్చట తీర్చే డైరెక్టర్ దొరుకుతారేమో చూద్దాం!