సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి మహేష్, రష్మిక ల కాంబినేషన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మహేష్ పక్కన రష్మిక సెట్ కాదనేది ఆయన అభిమానుల అభిప్రాయం. అసలే ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారు.

దీనికి తోడు రష్మిక చేసిన ఓ పని ఫాన్స్ కి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అసలు విషయంలోకి వస్తే.. దసరా కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో మహేష్ కొండారెడ్డి బురుజు వద్ద ఆయుధం చేత పట్టుకొని నిల్చొని ఉంటాడు. ఈ పోస్టర్ ని అనీల్ రావిపూడి తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ దసరా శుభాకాంక్షలు చెప్పారు.

ఈ పోస్ట్ కి మహేష్, రష్మిక, విజయశాంతి, దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, అనీల్ సుంకర ఇలా సినిమాకి చెందిన ప్రముఖులందరినీ ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ని రీట్వీట్ చేసిన రష్మిక 'హ్యాపీ దసరా' అంటూ రెండు ఎమోజీకు పెట్టి ఊరుకుంది. రష్మిక ట్యాగ్స్ ఇవ్వకపోవడం మహేష్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేశారు. కనీసం సినిమా పేరుని కూడా ట్యాగ్ చేయడం తెలియదా..? అంటూ మండిపడ్డారు. 

మహేష్ బాబు ట్విట్టర్ ట్యాగ్ ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే రీట్వీట్ చేయకుండా ఆలస్యం చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే.. 'నిన్ను మా అన్న పక్కన ఎలా భరించాలో.. నువ్ హీరోయిన్ ఏంటో మా కర్మ' అంటూ దారుణంగా రష్మికని ట్రోల్ చేశారు.