స్టార్ హీరోలతో నటిస్తే వెనువెంటనే రెమ్యునరేషన్ పెంచడం హీరోయిన్లకు అలవాటే. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక పై కూడా అలాంటి కథనాలే వెలువడుతున్నాయి. ఛలో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అనంతరం బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో అమ్మడు కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత గట్టిగానే ఉంది. సో అమ్మడు టైమ్ చూసి కొడుతోంది. పైగా క్రేజ్ ఉన్నప్పుడే ఆదాయాన్ని పెంచుకోవాలని అమ్మడు  తన రెమ్యునరేషన్ ని డబుల్ చేసినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు లక్షల్లో పారితోషికం అందుకున్న అమ్మడు ఇప్పుడు ఏకంగా 2కోట్లను అందుకుంటోందట. సక్సెస్ అందుకున్న ప్రతిసారి పారితోషికం పెంచుకుంటూ వస్తున్న అమ్మడు నెక్స్ట్ చేయబోయే సినిమాలకు గాను తను అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని రష్మిక రేంజ్ మాత్రం గట్టిగానే పెరిగినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం ఇది మరీ టూ మచ్ అంటున్నారు. హీరోయిన్స్ కొరత ఏర్పడిన సమయంలో ఈ విధంగా ఒకేసారి రెమ్యునరేషన్ పెంచేస్తే మంచి మంచి ఆఫర్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందని టాక్ వస్తోంది. ఇక బేబీ ఇప్పట్లో చిన్న సినిమాలు చేసేలా కనిపించడం లేదు.