గీత గోవిందం చిత్రం తర్వాత రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది. అలాగే యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ చిత్రంలో కూడా నటిస్తోంది. తమిళంలో కూడా రశ్మికకు ఆకాశాలు వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా అక్కినేని హీరో నాగచైతన్య త్వరలో దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో రష్మికని హీరోయిన్ గా అనుకున్నారట. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కే ఈ కథకు రష్మిక అయితే బావుంటుందని భావించారట. 

ప్రస్తుతం చైతు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే చిత్రం ప్రారంభం అవుతుంది. కానీ ఈ చిత్రంలో నటించలేనని రష్మిక చెప్పేసిందట. వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తుండడంతో వాటికీ డేట్స్ సర్దుబాటు చేయడం రష్మికకు ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. డేట్స్ ఇష్యూ వల్లే తమిళంలో ఓ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ ని కూడా రష్మిక వదులుకుంది. 

రష్మిక చివరగా తెలుగులో నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మహేష్ సరసన నటించే మూవీ హిట్ అయితే రష్మిక సౌత్ లో తిరుగులేని హీరోగా మారిపోవడం ఖాయం.