ఆ జుట్టు,గడ్డం నిన్ను అలా చూస్తూంటే అసహ్యం వేస్తోంది అంటూ డైరక్ట్ గానే చెప్పింది రష్మిక. అయితే నిజ జీవితంలో కాదు సుమా. పొగరు అనే సినిమా ట్రైలర్ లో . డైలాగుల వర్షం కురిసిన ఈ ట్రైలర్ అప్పట్లో వచ్చిన రౌడీ గారి పెళ్లాం ని గుర్తు చేస్తూ ఇంట్రస్టింగ్ గానే సాగింది. కన్నడ డబ్బింగ్ గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు కన్నడనాట వైరల్ గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే...యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, కన్న‌డ హీరో ధృవ హీరోగా రూపొందుతోన్న చిత్రం `పొగ‌రు`. శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్ బ్యాన‌ర్‌పై బి.కె.గంగాధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. నంద‌కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ్రెంచ్‌ బాడీ బిల్డ‌ర్ మోర్గాన్ అస్తే, అమెరిక్ ఐ.ఎఫ్‌.బి.బి ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్ కై గ్రీనే, ఇంట‌ర్నేష‌న‌ల్ అథ్లెట్ ఎవాల్యుయేష‌న్ స్పోర్ట్స్ న్యూటీష‌న్ జాన్ లుకాస్‌, జర్మ‌న్ ఫిట్‌నెస్ సెన్సేష‌న్ జో లిన్‌డ‌ర్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ తెలుగు వెర్షన్ ని తాజాగా విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

అడ్ర‌స్‌ క‌నుక్కుని స‌ర్వీస్ చేయ‌డానికి కొరియ‌ర్ బాయ్‌ని అనుకున్నార్రా.. ఫైట‌ర్‌.. కొడితే ఎవ‌డి అడ్ర‌స్ అయినా గ‌ల్లంత‌వ్వాల్సిందే. .. అంటూ హీరో ధృవ స‌ర్జా చెబుతున్న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేర‌కుంది. కొన్ని రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది.

  హీరో ధృవ స‌ర్జాకు, ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్‌కు మ‌ధ్య జ‌రిగే క్లైమాక్స్ సినిమాకే హైలైట్‌గా నిల‌వ‌నుంది. భైర‌వ‌గీత ఫేమ్ ధ‌నుంజ‌య్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ర‌వి శంక‌ర్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
ధృవ స‌ర్జా, ర‌ష్మిక మంద‌న్నా, సంప‌త్ రాజ్‌, రాఘ‌వేంద్ర కుమార్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, ధ‌నుంజ‌య్‌, మ‌యూరి, సాధుకోకిల‌, చిక్క‌న్న, త‌బ్లా నాని, కురి ప్ర‌తాప్‌, కైగ్రీనే, మోర్గాన్ అస్తే, జాన్ లుకాస్‌, జోలిండ‌ర్ త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: న‌ంద‌కిషోర్‌
నిర్మాత‌: బి.కె.గంగాధ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ మిల్ట‌న్‌
ఆర్ట్‌: బ్ర‌హ్మ క‌డ‌లి, మోహ‌న్ బి.కేరే