'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచిన రష్మిక ఆ తరువాత  'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమె నటించిన 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలు సక్సెస్ అందుకోవడంతో టాలీవుడ్ లో ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది.

వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో తరచూ విమానాల్లో ప్రయాణిస్తూ ఉంది. తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డాన్స్ చేస్తూ లోపలకి వెళ్లిపోయింది.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రష్మికపై మండిపడుతున్నారు.  రెండు హిట్లు వచ్చినంత మాత్రన అంత ఓవరాక్షన్ అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు. ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది అంటూ ఆమెకి సలహాలు ఇస్తున్నారు.

రష్మికపై ఈ నెగెటివిటీ మొత్తం కూడా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుండి మొదలైంది. ఆ సినిమాలో ఆమె మహేష్ సరసన అతి చేసిందనే కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ పై స్పందించిన రష్మిక దర్శకుడు డిజైన్ చేసిన పాత్రను బట్టి నటిస్తానని.. అది తన వృత్తి అని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.