గీతగోవిందం సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ రష్మిక మందన్న. వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ అందుకుంటున్న ఈ బేబీ రూమర్స్ పై చాలా వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడంలో ఆమె సక్సెస్ అవుతూనే ఉన్నారు.

ఇకపోతే ఇటీవల విజయ్ దేవరకొండతో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై రష్మిక మందన్న ఆగ్రహానికి గురైంది. ఆమె వివరణ ఇస్తూ.. "యాక్టర్స్ అయినంత మాత్రానా విమర్శిస్తారా? నటీనటుల మీద విమర్శలు చేస్తే మీకు ఏమొస్తుంది. నాకైతే అర్ధం కావడం లేదు. మేము చేసే సినిమాలను విమర్శించే హక్కు ఉంది. కానీ మా వ్యక్తిగత విషయాలపై అలాగే ఫ్యామిలీలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు.  

యాక్టర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ అయిపొయింది. చాలావరకు నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవద్దని అనుకుంటాను. ఎవరు కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కోకూడదని భావిస్తున్నా. ప్రతి వృత్తిని అందరు గౌరవించాలి. సినీ లైఫ్ లో యాక్టర్స్ గా ఉండటం అంత ఈజీ కాదు. ఫైనల్ గా అన్నిటికంటే ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలి.

ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో వారు సక్సెస్ అయ్యారు, కంగ్రాట్స్. నొప్పించాలని అనుకున్నారు. అనుకున్నదే జరిగింది అని రష్మిక వివరణ ఇచ్చారు.  గతంలో కూడా రష్మిక ఇలాంటి ఎఫైర్ రూమర్స్ ని ఎన్నింటినో ఎదుర్కొంది.

గీతగోవిందం - డియర్ కామ్రేడ్ సినిమాలో వరుసగా నటించడంతో విజయ్ దేవరకొండకు ఆమెకు మధ్య ప్రేమ నడుస్తోంది అని కొన్ని  కథనాలు కూడా వెలువడ్డాయి. వాటిపై ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ స్పందిస్తూనే ఉంది. మరి ఈసారైనా రూమర్స్ డోస్ తగ్గుతాయో లేదో చూడాలి. ప్రస్తుతం రష్మిక భీష్మ - సరిలేరు నికెవ్వరు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.