విశాఖపట్నం: యాంకర్ రష్మి కారు డీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవలే ఆమె కొత్త కారు కొనుక్కున్నారు. ఆ కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో రష్మీ చిక్కుల్లో పడ్డారు. 

విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి 11 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

గాయపడిన వ్యక్తిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.