టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కానీ చిత్ర యూనిట్ మాంత్రం క్లారిటీ ఇవ్వకుండా దోబూచులాడుతోంది. ఆ ఒక్కటి చెప్పకుండా సినిమాకు సంబందించిన టీజర్స్ తో హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే వెంకీ చైతులకు సంబందించిన లుక్స్ అలాగే పోస్టర్స్ ఆడియెన్స్ మదిలో అంచనాల డోస్ ని పెంచాయి.

ఒక సాంగ్ కు ఆడియెన్స్ నీవు ఆకట్టుకుంటోంది.  ఇక ఇప్పుడు రాశి ఖన్నాకు సంబందించిన మరో బైట్ ని వదిలారు. నేడు రాశి ఖన్నా పుట్టినరోజు సందర్బంగా వదిలిన ఈ చిన్న వీడియోలో వెంకీ వేసిన డైలాగ్ వైరల్ అవుతోంది. చిన్నప్పుడు చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని తిరిగేదానివి అంటూ వెంకీ రాశి ఖన్నాపై సాలిడ్ పంచ్ వేయగా అందుకు ఆమె ఇచ్చిన హావభావాలు కామెడీగా ఉన్నాయి.

ఇక చైతు లవర్ గా కనిపిస్తున్న రాశి ఎమోషనల్ డైలాగ్ తో బాగానే ఆకట్టుకుంటోంది.  మొత్తంగా సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది గాని రిలీజ్ డేట్ చెప్పకుండా ఆడియెన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జనవరిలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే డిసెంబర్ కి షిఫ్ట్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. అది కూడా కాదు ఫిబ్రవరికి రానున్నట్లు మరో టాక్ ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేసింది. ఎలా రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనం రాకపోవడం గమనార్హం.