పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న బిగ్ బడ్జెట్ మూవీ KGF 2 తెరపైకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కూడా ప్రభావం  చూపడం విశేషం. ఇక సమ్మర్ లో రానున్న ఛాప్టర్ 2 పై కూడా అన్ని భాషల్లో అంచనాలు పెరిగేలా చిత్ర యూనిట్ అడుగులు వేస్తోంది.

ఇక టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా తెలుగులో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. ఇక ఆయన చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది అనే సందేహాన్ని ప్రేక్షకుల ఊహలకే వదిలేస్తున్నట్లు ప్రశాంత్ ట్వీట్ చేశారు.

సినిమాలో సౌత్ స్టార్ యాక్టర్స్ తో పాటు సంజయ్ దత్ వంటి స్టార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రావ్ రమేష్ కూడా నటిస్తుండడంతో అయన పాత్ర కూడా స్ట్రాంగ్ గా ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ పాన్ ఇండియా సినిమాలో ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. KGF 2 సినిమా సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.