Asianet News TeluguAsianet News Telugu

రావు రమేష్ గురించే రచ్చ, సాయి తేజని పట్టించుకునేవాళ్లేరి?

ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేసింది రావు రమేష్. మనం ఇష్టపడినా, ద్వేషించినా ఆ పాత్రను మర్చిపోలేము అన్న రీతిలో రావు రమేష్ ఈ సినిమాలో అదరకొట్టారు. ముఖ్యంగా ఈ క్యారక్టర్ లో అనేక షేడ్స్ ఉండటంతో సినిమా చూసిన వాళ్లు ఈ పాత్రకు కనెక్ట్ అయ్యిపోతున్నారు. 

Rao Ramesh Is The key  Of Prati Roju Pandaage success
Author
Hyderabad, First Published Dec 22, 2019, 10:03 AM IST

 మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండుగే’. విభన్నమైన కాన్సెప్ట్‌లతో కమర్షియల్‌ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్‌ టైటిల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లు ఈ సినిమాను తెరకెక్కించడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ సైతం చాలా ఆశలు పెట్టుకున్నారు.

టీజర్, ట్రైలర్స్ బాగుండడంతో సినిమాపై అంచనాలు ఎక్సపెక్టేషన్స్ పెరిగి..మంచి ఓపినింగ్స్ ని రాబట్టాయి. దాదాపు ఏడు సినిమాలు ఫ్లాప్‌లు తర్వాత చిత్రలహరి సినిమాతో ఓ హిట్ అందుకున్న ఈ మెగా మేనల్లుడుకి ఈ సినిమా అదిరిపోయే రీతిలో ఆదుకోలేదు కానీ పాసైపోయింది.  అయితే ఆ క్రెడిట్ సాయి తేజ కు రాకుండా పోతోంది. అదే ఆయన అభిమానులను బాధిస్తోంది.

త్వరలో రానున్న ఇంట్రెస్టింగ్ మల్లీస్టారర్ సినిమాలు

ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేసింది రావు రమేష్. మనం ఇష్టపడినా, ద్వేషించినా ఆ పాత్రను మర్చిపోలేము అన్న రీతిలో రావు రమేష్ ఈ సినిమాలో అదరకొట్టారు. ముఖ్యంగా ఈ క్యారక్టర్ లో అనేక షేడ్స్ ఉండటంతో సినిమా చూసిన వాళ్లు ఈ పాత్రకు కనెక్ట్ అయ్యిపోతున్నారు. మీడియాతో సహా అందరూ ఈ పాత్ర గురించే మాట్లాడుతున్నారు. తన కొడుకుతో ప్రెండ్లీ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ..తండ్రి సత్యరాజ్ ని ఓల్డ్ పీస్ గా భావిస్తూంటాడు. త్వరలో ఎక్సపైర్ అయ్యిపోయే ఈ పీస్ గురించి తన పీస్ పోగొట్టుకునేలా ఆలోచించటం దండగ అనుకుంటాడు.చివరకు ఈ పాత్రలో మార్పు వస్తుంది.  ఇలా రావు రమేష్ పాత్రలో ఓ ఆర్క్ ఉంటుంది.

ట్రైలర్ చూసి అందరూ సత్యరాజ్, సాయి తేజ హైలెట్ అవుతారనుకున్నారు. అయితే రిలీజ్ అయ్యాక అందరూ ముక్త కంఠంలో రావు రమేష్ ..తన నట విశ్వరూపం చూపారని మెచ్చుకుంటున్నారు. మిగతా పాత్రలన్నీ ఆయన ముందు తేలిపోయాయనటంలో సందేహం లేదు.అయితే కొంతమంది కాస్త అతి చేసాడని అన్నారు. కానీ తెలుగు సినిమాకు దొరికిన గిప్ట్ ఈ ఆర్టిస్ట్ అనేది నిజం అంటోంది సోషల్ మీడియా. ఈ మాటల యుద్దాలలో సాయి తేజ మాయమైపోతున్నాడు.

ఇది సాయి తేజ సినిమా అన్న విషయం మర్చిపోతున్నారు.అలాగని సాయి తేజ్ ని తీసిపాడేయలేం. తన డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతటా ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తేజ్ నటన మెప్పించింది. అయితే రావు రమేష్ కు అలాంటి పాత్ర దొరికింది. దాన్ని తినేసాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో  హవాభావాలతో సినిమాకే హైలైట్ అనిపించుకుంటున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios