రణవీర్ సింగ్ బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విలక్షణ నటుడిగా మారిపోయాడు. రణవీర్ సింగ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల రణవీర్ సింగ్ నటించిన చిత్రాలని, ప్రస్తుతం ఎంచుకుంటున్న చిత్రాలని గమనిస్తే నటుడిగా అతడు చేస్తున్న సాహసాలు ఏంటో అర్థం అవుతుంది. 

రణవీర్ సింగ్ నటిస్తున్న మరో సాహసోపేతమైన చిత్రం జయేష్ భాయ్ జోర్దార్. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ లో విభిన్నమైన గెటప్ లో ఫన్నీగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో రణవీర్ గుజరాత్ యువకుడిగా నటిస్తుండడం విశేషం. దివ్యాంగ్ థక్కర్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

ఈ పాత్రలో నటించేందుకు రణవీర్ సింగ్ బరువు తగ్గాడు. మహిళలకోసం పోరాడే యువకుడిగా ఈ చిత్రంలో రణవీర్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతోంది. రణవీర్ సింగ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఒకర్ని నవ్వించాలంటే మనం బాధని దిగమింగాలి. ఇది చార్లీ చాప్లిన్ చెప్పిన విషయం. ఒక సాధారణమైన వ్యక్తి భయంకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఎలా స్పందిస్తాడనేది మీరు ఈ చిత్రంలో చూస్తారు అని రణవీర్ తెలిపాడు. 

యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదనే చెప్పాలి. కానీ రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరో సరసన నటిస్తుండడంతో ఇది షాలినికి మంచి అవకాశం అని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రణవీర్ సింగ్ కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83లో నటిస్తున్నాడు.