స్టార్ హీరో కాబట్టి తాను ఇలాంటి కథలే చేయాలని ఏమీ రణవీర్ గిరి గీసుకోలేదు. అందుకే రణవీర్ నుంచి అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. అతడు విలక్షణ నటుడు అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రణవీర్ సింగ్ కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83లో నటిస్తున్నాడు. 

తన నటనపై వస్తున్న ప్రశంసలపై రణవీర్ స్పందించాడు. తానెప్పుడూ స్టార్ డమ్ కోసం ఆరాటపడలేదని రణవీర్ సింగ్ అంటున్నాడు. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ చిత్రాలు రణవీర్ సింగ్ నటనా ప్రతిభకు నిదర్శనం. తాను స్టార్ హీరో అని కాకుండా అద్భుతమైన నటుడు అని కీర్తిస్తుండడం చాలా సంతోషాన్నిచ్చే విషయం అని రణవీర్ సింగ్ తెలిపాడు. ఈ ప్రశంసలు నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి. కెరీర్ ఆరంభం నుంచి నేను నా పాత్రపై మాత్రమే ద్రుష్టి పెట్టాను. 

పద్మావత్, గల్లీ బాయ్ లాంటి చిత్రాలు భవిష్యత్తులో కూడా చేస్తాను. నేను గొప్ప నటుడిగా మాత్రమే గుర్తించబడాలని కోరుకున్నా. స్టార్ డమ్ ని ఆశించలేదు. కానీ నటుడిగా నా పని నేను నెరవేర్చా. దాని ఫలితంగానే స్టార్ డమ్ కూడా వచ్చింది. చిత్ర పరిశ్రమకు రావాలనుకునే యంగ్ హీరోలకు నేను ఒకటే చెబుతున్నా. మీరు నటనపై మక్కువతో చిత్ర పరిశ్రమకు వచ్చారా లేక స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేయాలని వచ్చారా అనేది తెలుసుకోండి. 

స్టార్ స్టేటస్ కోసమే వచ్చేవాళ్ళు ఇక్కడ పనికిరారు. ఇక్కడ అనేక భాద్యతలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడాలంటే మీ వృత్తిపై మీకు ఆసక్తి ఉండాలి అని రణవీర్ కామెంట్స్ చేశాడు.