బాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా  మాజీ లవర్స్ కి సంబందించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కలిసి మరోసారి వెండితెరపై హాట్ రొమాన్స్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వారెవరో కాదు. బాలీవుడ్ లో ఒకప్పుడు లవ్ బర్డ్స్ గా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన రన్ బీర్ కపూర్ - దీపిక పదుకొనె.

ఈ జోడి గురించి అప్పట్లో వచ్చిన రూమర్స్ అంతా ఇంతా కాదు. వారి ప్రేమను చూసి అంతా షాక్ అయ్యారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే కామెంట్స్ ని నమ్మేశారు కూడా. దీపిక రణ్ బీర్ పేరును పచ్చబొట్టు వేయించుకుంది. వీరిద్దరు తమాషాగా అనే సినిమా చేశారు. ఊహించని విధంగా బ్రేకప్ చెప్పిన దీపిక రణ్ వీర్ ని పెళ్లి చేసుకుంది. బ్రేకప్ తరువాత మరో సినిమా చేయని ఈ జంట ఇప్పుడు మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

కథ డిమాండ్ చేయడంతో మంచి అవకాశాన్ని వ్యక్తిగత కారణాలతో వదులుకోకూడదని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చారట. దే దే ప్యార్ దే సినిమాను నిర్మించిన లవ్ నిరంజన్ ఈ కాంబో చేత సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ దర్శక నిర్మాత బిజీగా ఉన్నాడు.  రణ్ బీర్ - దీపిక ఎలాంటి అభిప్రాయ బేధాలు లేకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వస్తోంది. సినిమ్లో హెవీ రొమాన్స్ కూడా ఉంటుందట. దీంతో ఈ మాజీ లవర్స్ ఆ సన్నివేశాల్లో ఎలా నటిస్తారా? అని బాలీవుడ్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.