డిఫరెంట్ కథలతో నటుడిగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ రానా దగ్గుబాటి. బాహుబలి సినిమా అనంతరం రానాకి ఎన్నో ఆఫర్స్ వస్తున్నప్పటికీ కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు, అయితే రానా నెక్స్ట్ టార్గెట్ హిరణ్యకశిప. ఆ సినిమాతో సోలోగా అసలైన బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న హిరణ్యకశిప సినిమాని సురేష్ బాబు నిర్మించనున్నారు. సినిమాని ఫ్యాన్ ఇండియా లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే రానా ఇప్పటికే ఆ సినిమా కోసం ఒక బాడీ లాంగ్వేజ్ ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ లో బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. అంటే 2020లో రానా మరేపని పెట్టుకోడన్నమాట.

కేవలం హిరణ్యకశిపతోనే బిజీ కానున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా 100 మంది టెక్నీషియన్స్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులతో చిత్ర యూనిట్ బిజీగా గడిపింది. సినిమా చరిత్రలో నిలిచిపోవాలని చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే సినిమా తెరపైకి రావడానికి ఆలస్యమవుతోంది.

పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ సెట్ చేసుకున్న తరువాతే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు.  ఇప్పటికే గ్రాఫిక్స్ కి సంబందించిన ప్లాన్ సిద్దమైనట్లు సమాచారం. బారి సెట్స్ పై కూడా చిత్ర యూనిట్ ఒక అవగాహనకు వచ్చింది. ఈ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. ఫొటోగ్రఫీ బ్లాక్స్ నుంచి సీన్ టూ సీన్ స్క్రిప్ట్ వర్క్ పకడ్బందీగా వచ్చే వరకు షూటింగ్ స్టార్ట్ అయ్యే వీలు లేదని ఈ ఇటీవల నిర్మాత సురేష్ బాబు తెలియజేశారు.