రానా తాజాగా నటించిన బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' . ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందులో.. రానా గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’, తెలుగులో ‘అరణ్య’ టైటిల్స్  తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా చిత్ర యూనిట్ హిందీ టీజర్‌ను బుధవారం విడుదల చేసింది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరూ అదిరిపోయిందనే అంటున్నారు.  అడవిని నమ్ముకొని ఉన్న ఓ ఆదివాసి.. ఆ అడవికి ఆపద వస్తే ఏం చేశాడన్న కథతో ఈ సినిమా సాగనున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్దమవుతోంది. ఇందులో జోయా హుస్సేన్‌, శ్రియ, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేరళలోని అడవుల్లో సినిమా షూటింగ్ జరుగుతోంది.

మనుషులు తమ  స్వార్థం కోసం అడవులను నాశనం చేయడం, సహజ వనరులను దుర్వినియోగం చేయడం వల్ల మూగ జీవులు, వన్యప్రాణులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయనే కథాశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. మానవులు విపరీత చర్యల వల్ల ఏనుగులు అంతరించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, వాటి కోసం నిలబడి..అన్యాయాలను ధైర్యంగా ఎదరించిన ఓ వ్యక్తి కథే ఈ ‘అరణ్య’.

ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి 'బన్ దేవ్' పాత్రలో నటిస్తున్నారు.  పెరిగిన గెడ్డంతో ఒళ్లంతా గాయాలతో అడవి జంతువుల మద్య రానా ఉగ్ర రూపం‎తో రానా కలిపిస్తారు.  ఆస్కార్‌ విజేత రసూల్‌ సౌండ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రభు సోలోమాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా... ఈ సినిమా మూడు భాషల్లో ఏప్రిల్‌ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది.