దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం విటపర్వం. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రతిభగల వేణు ఊడుగుల దర్శకుడు. కొన్ని నెలల క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కానీ సడెన్ గా రానా అమెరికాకు వెళ్ళాడు. రానా అమెరికాకు వెళ్లడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అదే సమయంలో రానా ఊహించని విధంగా బరువు తగ్గడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. రానాకు ఆరోగ్య సమ్యస్యలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు రానాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఓ చిత్రం కోసమే రానా బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. 

ఇదిలా ఉండగా త్వరలో రానా అమెరికా నుంచి తిరిగి రానున్నాడు. వచ్చిన వెంటనే విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అవుతాడని టాక్. విరాటపర్వం చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా రానా తండ్రి, నిర్మాత అయిన సురేష్ బాబు ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శత్వంలో హిరణ్యకశ్యప చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఈ చిత్రం ఉండేలా తెరవెనుక వర్క్ జరుగుతోంది. మొత్తంగా రానా రాక కోసం క్రేజీ చిత్రాలు ఎదురుచూస్తున్నాయి.