రానా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని మీడియాలో, సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఇటీవల రానా అమెరికాలో ఉండడం పై కూడా ఊహాగానాలు వినిపించాయి. చికిత్స కోసం రానా అమెరికాకు వెళ్లడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

అదే సమయంలో రానా బాగా బరువు తగ్గడం కూడా అనుమానాలకు దారి తీసింది. ఈ వార్తలపై మరోసారి రానా క్లారిటీ ఇచ్చాడు. సింపుల్ గా ఒక ట్వీట్ చేశాడు. నేను స్వయంగా చెప్పనంతవరకు నా గురించి వచ్చిన ఏ వార్త అయినా నిజం కాదు అని ట్వీట్ చేశాడు. 

ప్రస్తుతం రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా మెప్పించిన రానా త్వరలో భారీ పౌరాణిక చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. 

గుణశేఖర్ దర్శత్వంలో రానా హిరణ్యకశ్యప చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించేందుకు తెరవెనుక కసరత్తులు జరుగుతున్నాయి.