టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హిరోలున్నా రానా దక్కించుకున్న క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఒక్క బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు దక్కించుకొని బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో.. హీరోగానే కాకూండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెక్స్ట్ అరణ్య సినిమాతో రానా ప్రేక్షకులకు సరికొత్త కిక్కివ్వాలని అనుకుంటున్నాడు.

అదే విధంగా రానా త్వరలోనే మరో రెండు స్పెషల్ ప్రాజెక్ట్ లపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా ద్వారా డైరెక్టర్ రాజమౌళికి బాగా దగ్గరైన రానా నెక్స్ట్ ఆయనతో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రానా కూడా త్వరలో తేజ డైరెక్షన్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

మరొక టాక్ ఏంటంటే.. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ సిద్ధం చేసుకుంటున్న ఒక వెబ్ సిరీస్ లో కూడా రానా కథానాయకుడిలా కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ [ప్రస్తుతం ప్రభాస్ తో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు తరువాత రానా తో నాగ్ వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.