భల్లాల దేవుడు రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో ఈవెంట్ మ్యానేజ్మెంట్ బిజినెస్ చేస్తున్న మిహీకా అనే యువతితో రానా ప్రేమలో ఉన్న  తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ విషయాన్ని రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన ప్రేయసి మిహీకాని కూడా పరిచయం చేశాడు. 

ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంగా వీరిద్దరి పెళ్లి కూడా ఖరారయింది. అందులో భాగంగా బుధవారం రోజు రామానాయుడు స్టూడియోలో రానా, మిహీకా నిశ్చితార్థం జరిగింది. కేవలం రానా, మిహీక కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు.  

లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎంగేజ్మెంట్ ని సింపుల్ గా పూర్తి చేశారు. తాజాగా రానా, మిహీకా నిశ్చితార్థం ఫోటోలు బయటకు వచ్చాయి. సాంప్రదాయ వస్త్రధారణలో రానా, మిహీకా మెరుపులు మెరిపిస్తునారు. రానా పంచె కట్టులో మ్యాన్లీ లుక్ తో ఆకట్టుకుంటుంటే.. ధగధగ మనే చీరలో మిహీకా మెరుపులు మెరిపిస్తోంది. 

చూడముచ్చటగా ఉన్న ఈ జంటని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. పెళ్లి ఎప్పుడనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు త్వరలో ప్రకటించనున్నారు.