మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 70 వసంతంలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీలు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

తాజాగా భల్లాల దేవుడు రానా చంద్రబాబుకు తనదైన శైలిలో బర్త్ డే విషెష్ తెలియజేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో చంద్రబాబు పాత్రని పోషించింది రానానే కావడం విశేషం. చంద్రబాబు పాత్రలో రానా చక్కగా ఓడిపోయాడు. చంద్రబాబు హావభావాలని రానా అలాగే పలికించాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ లో తాను పోషించిన చంద్రబాబు పాత్ర స్టిల్ ని, పక్కనే రియల్ చంద్రబాబు యుక్త వయసులో ఉన్న ఫోటోని జత చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్ డే చంద్రబాబు సర్.. మీ పాత్రలో నటించడం నాకు దక్కిన గౌరవం అని రానా ట్వీట్ చేశాడు. 

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో రానా పోషించిన పాత్రకు ప్రశంసలు దక్కాయి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.