తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానుల్లో చెరగని ముద్ర వేసారు. 2016లో జయలలిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణం తర్వాత ఆమె జీవితంపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అభిమానుల్లో చెరగని ముద్ర వేసారు. 2016లో జయలలిత అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణం తర్వాత ఆమె జీవితంపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. బహుశా జయలలిత జీవితంపై తెరకెక్కుతున్నన్ని బయోపిక్ చిత్రాలు మరే పొలిటీషియన్ పై తెరకెక్కలేదంటే అతిశయోక్తి కాదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పలువురు దర్శకులు జయలలిత జీవితం ఆధారంగా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'క్వీన్' తెరకెక్కుతోంది. ఇది జయలలిత జీవితంపై తెరకెక్కుతున్న వెబ్ సిరీస్. ఎమ్ఎక్స్ ప్లేయర్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ని ప్రజెంట్ చేస్తుండడం విశేషం. 

తాజాగా క్వీన్ ట్రైలర్ విడుదల చేశారు. జయలలిత పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించింది. జయ పాత్రలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 16 ఏళ్ల వయసులో చదువు మానేసి జయలలిత నటిగా మారినప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది. ట్రైలర్ లో చూపినదాని ప్రకారం రమ్యకృష్ణ ప్రతి సన్నివేశంలో జయలలితగా ఒదిగిపోయారు. 

ఈ వెబ్ సిరీస్ లో జయలలిత పేరుని శక్తి శేషాద్రి అని చూపిస్తున్నారు. ఎంజీఆర్ పాత్రని జీఎంఆర్ గా చూపిస్తున్నారు. రమ్యకృష్ణ కాస్ట్యూమ్స్, హావభావాలు జయలలితని గుర్తుచేసే విధంగా ఉన్నాయి. డిసెంబర్ 14న క్వీన్ వెబ్ సిరీస్ ని డిజిటల్ మార్కెట్ లోకి తీసుకురానున్నారు.