త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అల వైకుంఠపురములో చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మూవీ రిలీజ్ కు మూడు నెలల ముందు నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలైపోయాయి. 

బన్నీ సరసన రెండవసారి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. డీజే చిత్రాల్లో మ్యాజిక్ చేసిన ఈ జోడి మరోమారు ప్రేక్షకులని మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'సామజవరగమన' సాంగ్ రిలీజ్ చేయగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

నేడు రెండవ పాట 'రాములో రాములా' మాస్ బీట్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సాయంత్రం 4:05 గంటలకు సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయాలని భావించారు. బన్నీ నుంచి మాస్ బీట్ వస్తుండడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

కానీ అనూహ్యంగా  'రాములో రాములా' సాంగ్ రిలీజ్ ని రేపటికి(అక్టోబర్ 22) వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దీనితో బన్నీ అభిమానులు నిరాశ చెందారు. రేపు విడుదలయ్యే ఈ పాట ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటే వారి నిరాశ తొలిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.