ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం రెడ్. తమిళంలో ఘనవిజయం సాధించిన తడం చిత్రానికి ఇది తెలుగు రీమేక్. నివేత పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. 

ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ తర్వాత రామ్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో రెడ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా ప్రభావం తగ్గాక ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. 

 

తాజాగా ఈ చిత్రంలోని డించాక్ అంటూ సాగే స్పెషల్ సాంగ్ వీడియో ప్రోమోని రిలీజ్ చేశారు దాదాపు నిమిషం పాటు ఉన్న ఏఈ ప్రోమోలో రామ్ స్టెప్పులు, కుర్ర భామ హెబ్బా పటేల్ అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా ఉన్న ఈ పాటలో హెబ్బా పటేల్ అందాలు కనువిందు చేబోతున్నాయి. హెబ్బా పటేల్ కూడా డాన్సుల్లో రామ్ స్పీడ్ ని అందుకునే ప్రయత్నం చేసింది. ఇది ప్రేక్షకులకు మరో దిమాఖ్ ఖరాబ్ సాంగ్ అవుతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.