జనసేనాని పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్ష దాడి కొనసాగుతోంది. చాలా రోజులుగా వర్మ పవన్ పై సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లో హద్దులు దాటే విధంగా ఉన్నాయి. 

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రం తెరకెక్కుతోంది. పొలిటికల్ సెటైరికల్ మూవీ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో రాంగోపాల్ వర్మ పలువురు రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించబోతున్నాడు. 

రాంగోపాల్ వర్మ ఎక్కువగా ఈ చిత్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ స్టిల్ ని వర్మ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ పవన్ అభిమానులని రెచ్చగొట్టే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి సభపై ఇంగ్లీష్ భామల మధ్యలో ఉన్నట్లుగా ఈ స్టిల్ ఉంది. 

ఈ స్టిల్ చూస్తుంటే వర్మ పవన్ పాత్రని ఈ చిత్రంలో నెగిటివ్ యాంగిల్ లో చిత్రీకరించినట్లు స్పష్టం అవుతోంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్ర ట్రైలర్ లోని ఓ పిక్ ఇది. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే అది పూర్తిగా యాధృచ్చికమే అని వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.