‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యాన్స్ కు దసరా కానుక గా ఓ సినిమాని ప్రకటించారు. ఆయన 152వ సినిమాగా రూపొందనున్న ... ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం...  త్వరలో   రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారని. అయితే చిరంజీవి వంటి మెగాస్టార్ నటిస్తున్న సినిమాలో రామ్ చరణ్ చేసేదేమి ఉంటుంది. అంత గొప్ప క్యారక్టర్ ఏముటుంది అంటే..చిరంజీవి ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర ఇదని తెలుస్తోంది. కొరటాల స్క్రిప్టు రాసుకున్నప్పుడు ఈ పాత్రను చిరంజీవి చేస్తారని, ద్విపాత్రాభినయం అని ప్లాన్ చేసారు. ఇదో సోషియో పొలిటిక‌ల్ డ్రామా స్క్రిప్టు. ఇందులో ఒక కోణంలో నడి వయస్సు వ్యక్తిగానూ.. మ‌రో షేడ్ లో యువ‌కుడిగానూ క‌నిపించాల్సి ఉంది.

జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతంటే?

అయితే కథంతా విన్నాక తను ఇంకా కుర్రాడి పాత్రలో కనిపిస్తే బాగుండదని ...వేరే హీరో ఎవరితోనైనా చేయిద్దామని చిరు సజెస్ట్ చేస్తే..రామ్ చరణ్ ని ఒప్పించి సీన్ లోకి తెచ్చారంటున్నారు. అంటే రామ్ చరణ్ ఇప్పుడు యంగ్ చిరంజీవి గా కనిపించబోతున్నారన్నమాట. ఇక ఈ చిత్రం కోసం ఆర్ ఎఫ్ సి లో ఓ ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు.  

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఫైన‌ల్ వ‌ర్క్ ఫినిషింగ్ స్టేజెస్‌లో ఉంద‌ని సమాచారం. న‌వంబ‌ర్ నుంచి కంటిన్యూగా షూటింగ్ సాగుతుంద‌ని స‌మాచారం. అంతేకాదు... రామోజీ ఫిల్మ్ సిటీలో ఇర‌వై రోజుల పాటు తొలి షెడ్యూల్ సాగుతుంద‌ని... ఈ భారీ షెడ్యూల్‌లో ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ను తీస్తారని టాక్‌.

`ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల‌ను నిర్మించిన  రామ్ చ‌ర‌ణ్... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కూడా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. అయితే, గ‌త రెండు సినిమాల త‌ర‌హాలో సోలోగా కాకుండా మ్నాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌ల‌సి చ‌ర‌ణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండ‌డం విశేషం.