Ravi Teja:ఏంటి రాజా ఈ వార్త నిజమా? నీకు ఈ పరిస్దితి ఏంటి?

లేటెస్ట్ గా ఖిలాడి సినిమాకు 40 కోట్ల ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆయన వద్దన్నాడు. అలాంటి రవితేజ తన సినిమాను ఎందుకు ఓటిటీ డైరక్ట్ రిలీజ్ కు ఎందుకు ఓకే చేస్తాడు? అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. అయితే అందుకు మీడియా వర్గాలు కొన్ని కారణాలు చూపెడుతున్నాయి.

Ramarao On Duty will be releasing on OTT directly?

కొన్ని విషయాలు నమ్మబుద్ది కావు. అలాంటి వాటిల్లో ఒకటి కోవిడ్ కూడా కంట్రోలులోకి వచ్చిన ఈ టైమ్ లో రవితేజ లాంటి పెద్ద హీరో సినిమా డైరక్ట్ ఓటిటి రిలీజ్ అవటం. అందులో నిజమేంటి...అసలు రవితేజ ఒప్పుకుంటాడా?

గత రెండు రోజులుగా రవితేజ అభిమానులు ఆశ్చర్యపోతూ డిస్కస్ చేస్తున్న విషయం...తమ అభిమాన హీరో  రవితేజ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అవటం. అయితే రవితేజ ఇలాంటి వాటికి  ఒప్పుకోడు కదా.. అంతకు ముందు సంవత్సరం క్రాక్ సినిమాకు మంచి ఓటిటి  ఆఫర్ వచ్చినప్పుడు..లేటెస్ట్ గా ఖిలాడి సినిమాకు 40 కోట్ల ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆయన వద్దన్నాడు. అలాంటి రవితేజ తన సినిమాను ఎందుకు ఓటిటీ డైరక్ట్ రిలీజ్ కు ఎందుకు ఓకే చేస్తాడు? అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. అయితే అందుకు మీడియా వర్గాలు కొన్ని కారణాలు చూపెడుతున్నాయి.

మాస్‌ మహారాజ రవితేజ- శరత్‌ మందవ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఎల్ ఎల్ పి బ్యానర్లో సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్‌ మండవ తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.  

ఇక  కరోనా కారణంగా వాయిదా పడ్డ పెద్ద సినిమాలు, పాన్‌ ఇండియా చిత్రాలు వరస పెట్టి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి జూన్ వరకు పెద్ద సినిమాల హావానే కొనసాగనుంది. ఈ క్రమంలో చిన్న, మీడియం సినిమాలకు రిలీజ్‌ డేట్‌ దొరకడం లేదు. రవితేజ చిత్రం మంచి బడ్జెట్ సినిమానే. అయితే ఆయనకు ఖిలాడి సినిమా డిజాస్టర్ అవటంతో ఈ  సమస్య వచ్చింది పడిందని అంటున్నారు.

డిస్ట్రిబ్యూట్లకు కూడా ఖిలాడీ భారీ నష్టాలనే తీసుకొచ్చిందని సమాచారం. దీంతో  ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీపైనే రవితేజ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఖిలాడి ఎఫెక్ట్ ఈ మూవీ బిజినెస్‌పై భారీ ప్రభావం పడుతోందిట. చెప్పిన రేటుకు కొనేలా లేరట. అయితే ఓటిటిలో అయితే అనుకున్న రేట్ పలికిందిట. దాంతో నిర్మాత ఓటిటి వైపే ఉత్సాహం చూపిస్తున్నారట. కానీ రవితేజ ఒప్పుకున్నాడా

కాకపోతే తమ ఓటిటి స్ట్రీమింగ్ పార్టనర్ సోనీ లీవ్ అంటూ పోస్టర్ విడుదల చేశారు రామారావు ఆన్ డ్యూటీ దర్శక నిర్మాతలు. అంటే సినిమాను నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నట్లుగా చెప్పకనే చెప్పినట్లే అంటున్నారు అభిమానులు. ధనుష్ వంటి స్టార్ ఓటిటిలో వరస రిలీజ్ లు చేస్తున్నారు. అ క్రమంలో తప్పేమి కాదంటున్నారు. ఒకవేళ ఈ సినిమా నిజంగానే నేరుగా ఓటీటీలో విడుదలైతే రవితేజ కెరీర్‌లో ఇదే మొదటి సినిమా అవుతుంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. అన్నట్లు ఈ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు దర్శకుడు శరత్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios