సాధారణంగా సినిమా కథను హీరో ని కలిసి నేరేట్ చేస్తూంటారు దర్శకులు. కానీ లౌక్ డౌన్ పుణ్యమా ఎవరూ వాళ్ల వాళ్ల ఇళ్లను దాటి బయిటకు రాలేని సిట్యువేషన్. దాంతో ఫోన్ ల్లోనే పని కానిచ్చేస్తున్నారు. స్టోరీ లైన్ సింపులు గా చెప్పి..నచ్చితే స్క్రిప్టు మెయిల్ చేసి చదువుకోమంటున్నారు. లౌక్ డౌన్ పూర్తయ్యేసరికి ఇలా చేస్తే తమ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుందని వాళ్ల ఆలోచన. అయితే ఇది ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది అంటే ..కాస్త కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే స్టోరీ లైన్ గా చెప్పటానికి అన్ని కథలూ సహకరించవు. ముఖ్యంగా ట్రీట్మెంట్ బేస్ కథలను పూర్తి గా వింటేనే ఓ అంచనాకు రాగలగుతారు. అలాంటప్పుడు స్టోరీ లైన్ విని ..నో చెప్పేసే ప్రమాదం ఉంది. అలాంటి అనుభవం దర్శకుడు మారుతికు జరిగిందని మీడియాలో ప్రచారం మొదలైంది.

అందుతున్న సమాచారం ప్రకారం ప్రతీరోజు పండగే చిత్రం తర్వాత దర్శకుడు మారుతి ఓ విభిన్నమైన స్టోరీ లైన్ తీసుకుని స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఆ కథకు హీరోను వెతుకుతున్నారు. అందులో భాగంగా హీరో రామ్ తో కథ చెప్పాల్సిన సిట్యువేషన్. అయితే అనుకోకుండా లాక్ డౌన్ రావటంతో..బయిటకు వెళ్లి ఎదురుగా కూర్చుని కథ చెప్పలేము. అందుకే స్టోరీ లైన్ ని ఫోన్ లో చెప్పారట. అది విన్న రామ్ నో చెప్పాడని తెలుస్తోంది. తాను అలాంటి కథ చేసే ఉద్దేశ్యంలో లేదని చెప్పేసాడట. 

వాస్తవానికి దర్శకుడు మారుతి కథలు మొత్తం ట్రీట్మెంట్ బేస్ గా సాగుతూంటాయి. ఫన్ , కొద్దిపాటి యాక్షన్ తో లాగేస్తూంటారు. ముఖ్యంగా ఫ్యామీలీ ఎమోషన్స్ కు ప్రయారిటీ ఉంటుంది. అయితే రామ్ ఇన్నాళ్లూ అలాంటి కథలే చేసుకుంటూ వచ్చారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ తన మనస్సు మార్చుకున్నారు. యాక్షన్ తో కూడిన కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా రెడ్ సినిమాను ఓకే చేసి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మారుతి చెప్పిన స్టోరీ లైన్ ..తనకు నప్పదనిపించవచ్చు. కానీ మారుతి కనుక ఎదురుగా కూర్చుని పూర్తి నేరేషన్ ఇస్తే ఖచ్చితంగా ఓకే చేద్దుడని, అలాంటి గోల్డన్ ఛాన్స్..ఈ లాక్ డౌన్ తో మిస్సైందని అంటున్నారు సినీ జనం.