ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ ఓ రీమేక్ చిత్రాన్ని ప్రారంభించాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం చిత్రాన్ని తెలుగులో రెడ్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. 

తాజాగా రెడ్ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తుండడం విశేషం. 'క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేస్ చూడడం ఇదే ఫస్ట్ టైం' అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో రెడ్ టీజర్ ప్రారంభం అవుతుంది. రామ్ క్లాస్, మాస్ లుక్స్ లో అదరగొడుతున్నాడు. ఈ చిత్రంలో రామ్ పాత్రల పేర్లు సిద్దార్థ్, ఆదిత్య. 

ఈ చిత్రంలో నివేత పేతురజ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ లో చూపిన పాత్రలో రామ్ మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. పోలీస్ఆఫీసర్ అయిన నివేతకే రామ్ కన్ను కొడుతున్నాడంటే అతడి పాత్ర ఎంత మాస్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. 

'వాంటెడ్ గా నన్ను ఇందులో ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్ లో వాడికున్న వన్ అండ్ ఓన్లీ అబ్సెషన్ నేనే' అంటూ రామ్ చెబుతున్న డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో నివేత పేతురాజ్ తో పాటు మాళవిక శర్మ,అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.