ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తొలిచిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అలాంటి అవకాశం కల్పించిన తన ఫేవరెట్ దర్శకుడు వైవీఎస్ చౌదరి పుట్టిన రోజు ఇవ్వాళ్లే కావడంతో బెస్ట్ విషెస్ తెలిపారు. హార్ట్ టచింగ్ వర్డ్స్ వదిలారు.  

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇప్పటి వరకు ఇండస్ట్రీలో 16 ఏండ్ల కేరీర్ ను పూర్తి చేశారు. తన తొలిచిత్రం దేవదాస్ (Devadasu)తో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. గ్లామర్ బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2006 జనవరి 11న రిలీజ్ అయ్యింది. యూత్ ను బాగా ఆకట్టుకున్న చిత్రది. ఇక మూవీలోని సాంగ్స్ కూడా ఓ రేంజ్ లో ఊపూపాయి. ఎక్కడ చూసినా ఇవే సాంగ్స్ వినిపిస్తుండేవి. ఇప్పటికీ సంగీత ప్రియులు చక్కి అందించిన మ్యూజిక్ ట్రాక్ ను ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి (YVS Chowdary) తెరకెక్కించారు. రామ్ పోతినేనిని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఈ రోజు ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హీరోని తెలుగు ఆడియెన్స్ కు అందించారు. 

అయితే, ఈరోజు వైవీఎస్ చౌదరి పుట్టిన రోజు కావడంతో సినీ ప్రముఖుులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తనకు లైఫ్ నిచ్చిన డైరెక్టర్ చౌదరికి రామ్ పోతినేని కూడా ట్వీటర్ వేదికన బెస్ట్ విషెస్ తెలిపారు. చౌదరి ఫుల్ సైజ్ ఫొటోను షేర్ చేసుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే వైవీఎస్ చౌదరి గారు.. నా జీవితంలో మీరు లేకపోతే ఈరోజు ఈరోజులా అనిపించేది కాదు’ అంటూ ట్వీట్ చేశాడు. తన పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా వైవీఎస్ చౌదరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఇఫ్పటికీ తన డైరెక్టర్ ను గుర్తు పెట్టుకోవడం పట్ల అభినందిస్తున్నారు. 

1998లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వైవీఎస్ చౌదరి తక్కువ సినిమాలే తీసినా సక్సెస్ మాత్రం ఎక్కువగానే చూశాడు. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీ సీతా రాముల కళ్యాణం, సీతారామరాజు, సీతయ్య, దేవదాసు, ఒక్కడు, నిప్పు వంటి చిత్రాలను తెరకెక్కించాడు. చివరిగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘రేయ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం రిలీజ్ కాలేదు. మొత్తంగా వైవీఎస్ చౌదరి సినిమాలు బయటికి రాక పదేండ్లు పూర్తైంది. ఇక రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 


Scroll to load tweet…