ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా నటిస్తున్న  చిత్రం ‘ది వారియర్’. పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ ఫస్ట్ టైం కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పనిచేసిన తమిళ స్టార్ శింబుకు రామ్ తాజాగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.  

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, త‌మిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషనల్ లో తొలిసారి తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’ The Warrior. ఈ చిత్రంలో రామ్ పోతినేని పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అదే స్థాయిలో ఈ చిత్ర సాంగ్స్ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. పవర్ ఫుల్ బీజీఎంగా కూడా రానుందంట. అయితే ఈ చిత్రంలోని ఓ సాంగ్ కోసం తమిళ స్టార్ హీరో శింబును (Simbu) రంగంలోకి దించారు. గతంలో సింగర్ గా ఆకట్టకున్న శింబు వాయిస్ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు తోడవటం మూవీపై ఆసక్తిని పెంచుతుంది. ఇటీవల సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయ్యినట్టు తెలుస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ తరువాత  రామ్ తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై చాలా శ్రద్ధ వహిస్తున్నారు. మాస్ యాంగిలే నమ్ముకున్న ఈ హీరో.. ప్రస్తుతం ‘ది వారియర్’పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్‌ పోతినేని కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో శింబును ఓ పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తొలుత వార్తలు వినిపించాయి. కానీ, అదిరిపోయే సాంగ్ కు శింబు గాత్రదానం చేశారని తెలిసింది. 

అయితే తన సినిమా కోసం పనిచేయడం పట్ల రామ్ పోతినేని శింబుకు మరోసారి ట్విట్టర్ వేదికన థ్యాంక్స్ చెప్పారు. అయితే ‘మీరు ఎంతో అద్భుతమైన గాయకులు..  బా బుల్లెట్ సాంగ్ ని మీ గాత్రంతో మరో స్థాయికి తీసుకెళ్లినందుకు, నా సోదరుడు శింబుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పిస్తున్నారు. 

రామ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ది వారియర్ ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Dsp) సంగీతం అందిస్తుండగా.. బుల్లెట్ సాంగ్ ను శింబు పాడారు. ఈ సాంగ్ ను ‘ది వారియర్’ ఫస్ట్ సింగిల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మే 15న రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, త‌మిళ ఆడియన్స్ కు  సుప‌రిచితుడైన ఆది పినిశెట్టి ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇక ఈ సినిమాలో  ఉప్పెన ఫేం కృతిశెట్టి (Kriti Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. 

 

Scroll to load tweet…