రామ్ కు మాస్ ప్రేక్షకులతో పోల్చి చూస్తే క్లాస్ ప్రేక్షకుల్లోనే మంచి గుర్తింపు ఉంది. క్లాస్ సినిమాలే రామ్ ఈ స్థాయికి రావడానికి కారణమయ్యాయి.అందుకే అతనికి యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. రామ్ గతంలో కొన్ని మాస్ సినిమాలలో నటించినా వరుసగా మాస్ సినిమాలలో నటించలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో రామ్ రూట్ మార్చారు.
హీరోలందరికీ తాము మాస్ లోకి వెళ్లాలి...అందుకోసం యాక్షన్ సినిమాలు చేయాలని ఉంటుంది. అయితే తమ బాడీ లాంగ్వేజ్ కు అవి సరిపడతాయో లేవా అని చూసుకోరు. కొందరికి మాత్రమే అవి సెట్ అవుతాయి. తెలివిన కొందరు హీరోలు మాత్రమే తమకు తగిన సినిమాలు మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మిగతావాళ్ళు మాస్ మంత్రం జపిస్తూంటారు. అయితే రామ్ లాంటి హీరోలుది మరో సిట్యువేషన్. ఇంకా లవర్ బోయ్ పాత్రలు, లవ్ స్టోరీలు చేయలేరు. దాంతో వేరి దారి లేదు. ఖచ్చితంగా మాస్ సినిమాకు జై కొట్టాల్సిందే. కాకపోతే దాని వల్ల కొన్ని వర్గాల అభిమానులు దూరం కావచ్చు. కొంత మార్కెట్ మాయమవచ్చు. అదే సమయంలో కొత్త మార్కెట్ యాడ్ అవ్వచ్చు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన రామ్ కు మాస్ ప్రేక్షకులతో పోల్చి చూస్తే క్లాస్ ప్రేక్షకుల్లోనే మంచి గుర్తింపు ఉంది. క్లాస్ సినిమాలే రామ్ ఈ స్థాయికి రావడానికి కారణమయ్యాయి.అందుకే అతనికి యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. రామ్ గతంలో కొన్ని మాస్ సినిమాలలో నటించినా వరుసగా మాస్ సినిమాలలో నటించలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో రామ్ రూట్ మార్చారు. ఇస్మార్ట్ శంకర్ కు నెగిటివ్ రివ్యూలు వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా హిట్ గా నిలిచింది. దాంతో వరస మాస్ సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో యుఎస్ లో రామ్ మార్కెట్ ...తగ్గే సూచనలు కనపడుతున్నాయి. రామ్ పోతినేని తెలుగులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేస్తుకుంటూ పోతున్నాడు. పూరి తో చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవటంతో అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.వెంటనే చేసిన మరో మాస్ ఫిల్మ్ రెడ్ వర్కవుట్ కాలేదు. దాంతో అతను ఇప్పుడు తమిళ మాస్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ది వారియర్‌తో వస్తున్నాడు. బోయపాటి శ్రీనివాస్‌తో ఒక సినిమా కూడా పైప్‌లైన్‌లో ఉంది, ఇది మళ్లీ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.
ఈ సినిమా దాదాపుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఊరమాస్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో రామ్ ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా మాస్ సినిమాగానే తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. మాస్ మంత్రాన్ని జపిస్తున్న రామ్ యుఎస్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌లను ఆదరిస్తున్నందున US ప్రేక్షకులు ఈ మాస్ సినిమాలను అంతగా ఆదరించడం లేదు. కాబట్టి రామ్ కంటిన్యూ మాస్ ర్యాంపేజ్ ఓవర్సీస్ మార్కెట్‌లో అతని సినిమాల కలెక్షన్లను దెబ్బతీస్తోంది. అయితే ఇక్కడ మార్కెట్ ఉండగా యుఎస్ మార్కెట్ అవసరమా అనిపించవచ్చు.
కానీ ట్రేడ్ లెక్కల్లో ఈ రోజుల్లో యుఎస్ మార్కెట్ ఏ స్టార్ విజయానికి చాలా కీలకమైన బేరోమీటర్. రామ్ తన సినిమాలు అన్ని మార్కెట్లలో సమానంగా మంచి బిజినెస్ చేసేలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రామ్ తన సినిమాల బిజినెస్ నిలకడగా ఉండాలంటే మాస్ , క్లాస్ సినిమాల మధ్య బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని యూఎస్ ట్రేడ్ లో టాక్ నడుస్తోంది. అతను మళ్లీ రెడీ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లను ప్రయత్నించాలి, అది అతని కెరీర్‌ను దీర్ఘకాలంలో నిలబెట్టుకోవచ్చని చెప్తున్నారు.
