దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్ధిక సాయం చేయాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్ధిక సాయం చేయాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక భవిష్యత్తు బాగుండాలని.. తోచిన విరాళం అందించి ఆదుకోమని కోరారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చెన్నకేశవులు భార్య రేణుక పాపకు జన్మనిచ్చిందని.. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని... అయితే రేపిస్టుల నీడ వారి భవిష్యత్తుపై పడకుండా ఉండాలంటే.. దయచేసి ఎవరికి తోచిన సాయం వారు చేయండి అంటూ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి అకౌంట్‌ నంబర్ షేర్‌ చేసి... రేణుకకు విరాళం ఇవ్వాల్సిందిగా కోరారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగే నాటికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు దర్శకుడు ఆర్జీవీ కొన్నిరోజుల క్రితం ప్రకటించారు.

ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి ఇటీవల వర్మ .. చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు. అలానే పలువురు పోలీసు అధికారులతోనూ భేటీ అయ్యారు. 

Scroll to load tweet…