ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ.. నిర్భయ తల్లితండ్రుల ఫీలింగ్స్ ని మీరు ఊహించగలరా..? మోదీ గారు అంటూ ప్రశ్నించారు. అది తెలుసుకోవడం కోసం.. నిర్భయని చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కిందా మీదా పడుతున్నాయో చూడండి అంటూ ట్వీట్ చేశారు. 

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా వేయడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్ కి గురైతే.. నేడు మన సిస్టం చేతిలో గ్యాంగ్ రేప్ కి గురవుతోందని ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ.. నిర్భయ తల్లితండ్రుల ఫీలింగ్స్ ని మీరు ఊహించగలరా..? మోదీ గారు అంటూ ప్రశ్నించారు. అది తెలుసుకోవడం కోసం.. నిర్భయని చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కిందా మీదా పడుతున్నాయో చూడండి అంటూ ట్వీట్ చేశారు.

నిర్భయ నిందితుల తరఫు వాదిస్తోన్న లాయర్ ఏపీ సింగ్.. నిర్భయ తల్లితో 'వీళ్లని ఎప్పటికీ ఉరి తీయలేరని' ఛాలెంజ్ చేసినట్లు విన్నానని.. అది చాలా దరిద్రమైన విషయమని అన్నారు.

ఇలాంటి లాయర్లు సిస్టంని కూడా మానిప్యులేట్ చేయగలరని.. ఇలాంటి వారు మరింత ప్రమాదకరమని అన్నారు. అలానే 'దిశ' కేసులో తెలంగాణా పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ పరోక్షంగా కామెంట్స్ చేస్తూ నిర్భయకి మాత్రం న్యాయం జరగడం లేదని ఇండియన్ సిస్టంని దుయ్యబట్టారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…