వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ముందు నుంచి ట్రంప్ అంటే వర్మ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. తాజాగా ట్రంప్ పై వర్మ పేల్చిన సెటైర్లు మామూలుగా లేవు. 

కరోనా వైరస్ ని ఎదుర్కొనడంలో అమెరికా వైఫల్యాన్ని వర్మ ఎత్తిచూపాడు. చంద్రుడిమీదకు మనిషిని పంపి తిరిగి తీసుకురాగలిగిన దేశం ప్రస్తుతం మెడికల్ సామాగ్రిని కూడా సరఫరా చేయలేకపోతోందనేది వాస్తవం. ఇప్పటి వరకు ప్రపంచ అమెరికా గురించి మంచి అనుకున్న విషయాలు చెడుగా మారుతున్నాయి. 

అమెరికా లోపాలన్నీ బయట పడుతున్నారు.. ఇందుకు కారణం ఎవరు అంటూ వర్మ ట్రంప్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసాడు. ట్రంప్ ని మించిన అమెరికా దేశ ద్రోహి మరొకరు లేరు అని వర్మ వ్యాఖ్యానించాడు. 

ఆమె నాకు సవాల్ విసిరింది.. రెచ్చిపోయిన మోహన్ బాబు

అలాగే ట్రంప్ యుద్ధ కాలపు అధ్యక్షుడు అని కామెంట్ చేస్తూ.. ట్రంప్.. నార్త్ కొరియా అధ్యక్ధుడు కిమ్ ఫోన్ లో మాట్లాడుకుంటున్న మీమ్ షేర్ చేశాడు.