సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కథలను ఎన్నుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది.

అలానే మరో పక్క 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' అనే సినిమాని తెరపైకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రమని, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా టీజర్‌ ని బ్రూస్ లీ 80వ జయంతి సందర్భంగా ఈరోజు విడుదల చేశారు.

విజయశాంతి కోసం చాలా తిరిగా.. అనీల్ రావిపూడి కామెంట్స్!

టీజర్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఒక పాటతో నడిచింది. బ్రూస్ లీని ఎంతో అభిమానించే అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతూ ఉంటుంది. తన మార్షల్ ఆర్ట్స్ కోసం ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది.

టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్, రొమాన్స్ తో మిక్స్ చేశారు. హీరోయిన్ ని కూడా ఎంతో హాట్ గా చూపించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇండో-చైనా సంయుక్త ప్రోడక్షన్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్‌ సిటీలో డిసెంబర్‌ 13న విడుదల చేయనున్నట్టు తెలిపారు.