తన సినిమాలతోనే కాదు తన సోషల్ మీడియా పోస్ట్ లతో కూడా మీడియాకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంటాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ. ఇటీవల సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోతున్న వర్మ, ఆ సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వటంలో మాత్రం సూపర్‌ హిట్ అవుతున్నాడు. తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు మరో ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దళపతి సినిమాలో రజనీకాంత్, మమ్ముట్టిల మీద రూపొందించిన తమిళ పాటను భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు పాడుతున్నట్టుగా ఎడిట్ చేశాడు ఓ వ్యక్తి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో దాన్ని వర్మ షేర్ చేశాడు. అంతేకాదు వీడియోను షేర్ చేయటంతో పాటు ఆ పాటను ఎడిట్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుందట ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఈ వీడియోపై నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం కరోనా సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించటంతో పాటు ఫన్నీ ట్వీట్స్‌తో నెటిజెన్లను అలరిస్తున్నాడు ఆర్జీవి. అంతేకాదు తాజాగా కరోనా పై ఓ సినిమాను కూడా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించాడు.