ఇప్పటికే రాయ్ లక్ష్మి పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ చేసి అందాలు ఆరబోసింది. ఇటీవల రాయ్ లక్ష్మి ని వెతుక్కుంటూ మంచి అవకాశాలు వస్తున్నాయి. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, హర్రర్ కథలని దర్శకులు రాయ్ లక్ష్మి కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాల్లో కూడా అవసరమైతే గ్లామర్ షోకి రత్తాలు వెనుకాడడం లేదు. 

రాయ్ లక్ష్మి ఇప్పటికే వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, జూలీ 2 లాంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మి 'సిండ్రిల్లా' అనే హర్రర్ చిత్రంలో నటిస్తోంది. వినో వెంకటేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

వెంకటేష్ మాట్లాడుతూ.. ఇటీవల అనేక హర్రర్ చిత్రాలు వస్తున్నాయి. వాటన్నింటికి సిండ్రిల్లాభిన్నంగా ఉంటుంది.  ఈ చిత్రంతో రాయ్ లక్ష్మికి అందాలు ఆరబోసే హీరోయిన్ అనే ఇమేజ్ పోతుందని రాయ్ లక్ష్మి వెంకటేష్ అన్నారు. 

ఇప్పటివరకు రాయ్ లక్ష్మిని గ్లామర్ లుక్ లో చూసిన ప్రేక్షకులంతా ఈ చిత్రంలో భిన్నంగా చూస్తారు. చిత్రం చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ చిత్రంలో సాక్షి అగర్వాల్ ప్రతినాయిక గా నటించింది. 

రాయ్ లక్ష్మి నటించిన సిండ్రిల్లా టీజర్ ని ఇటీవల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ..  నటుడు, దర్శకుడు అయిన ఎస్ జె సూర్య ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో థియేటర్స్ మొత్తం సిండ్రిల్లా ఎఫెక్ట్ తో ఉత్కంఠగా మారుతాయి అని వర్మ కామెంట్ చేశాడు.