మెగా ఫ్యామిలీలోకి మరో కొత్త అతిథి వచ్చేసింది. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు పండంటి పాప పుట్టింది.
మెగా ఫ్యామిలీలోకి మరో కొత్త అతిథి వచ్చేసింది. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు పండంటి పాప పుట్టింది. అపోలో హాస్పిటల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ఉపాసనతో భర్త రామ్ చరణ్, తల్లి శోభన కామినేని, అత్తమ్మ సురేఖ కొణిదెల ఉన్నారు.
ఈ గుడ్ న్యూస్‌తో మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషంగా ఉన్నారు. నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఉపాసన చాలా యాక్టివిటీస్‌లోనూ పాల్గొంది.
రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి 11 ఏళ్లు పూర్తయ్యింది. ఈ జంటకు 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇటీవలే తమ 11వ పెళ్లిరోజును వీరిద్దరూ జరుపుకున్నారు. పెళ్లయ్యి పదేళ్లయినా రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి పాప పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
