తమిళ,తెలుగు..ఇంకా అవకాసం ఉంటే హిందీలోనూ మార్కెట్ ఉన్న డైరక్టర్స్ హీరోలకు కావాలి. అప్పుడే ఈ మూడు భాషల్లోనూ సినిమాలు క్రేజ్ తో రిలీజ్ అవుతాయి. అలా తాము కూడా ఆ భాషల్లో బిజీ కావచ్చు. ఇప్పుడు తెలుగు,తమిళ,కన్నడ స్టార్స్ వ్యూహాలు ఇవే. అందుకోసం డైరక్టర్స్ ని వెతుకుతున్నారు. ఆ క్రమంలో రామ్ చరణ్ కూడా ఓ డైరక్టర్ ని లాక్ చేసే పనిలో పడినట్లు సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ని  రీసెంట్ గా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసినట్లు సమాచారం. ఓ స్టోరీ లైన్ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. లోకేష్ రీసెంట్ గా కార్తీతో ఖైదీ అనే హిట్ కొట్టి ఉన్నారు. దాంతో స్టార్స్ అంతా తమకు కథ చెప్పమని ఆ డైరక్టర్ ని అడుగుతున్నారు. అయితే లోకేష్ దృష్టి తెలుగు హీరోలపై ఉంది. మన స్టార్స్ దృష్టి తమిళ డైరక్టర్స్ పై ఉండటంతో...వెంటనే ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. త్వరలోనే ఫైనల్ నేరేషన్ ఇచ్చి ...రామ్ చరణ్ డేట్స్ లాక్ చేసుకుంటారని అంటున్నారు.

సంపాదించడం మాకూ తెలుసు.. స్టార్ హీరోలకు ధీటుగా వారి భార్యలు!

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత అప్ డేట్స్ లేవు. వంశీ పైడిపల్లి సైతం మహేష్ తో సినిమా చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ తమిళ దర్శకుడుతో రామ్ చరణ్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కు తమిళంలోనే కాక ఖైదీతో తెలుగులోనూ క్రేజ్ రావటం బిజినెస్ పరంగా ప్లస్ అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం లోకేష్...విజయ్ తో సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తవగానే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది. అప్పుడు అఫీషియల్ ప్రకటన వచ్చే అవాకంస ఉంది. ఏదేమైనా వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ ...ప్రాజెక్టులు కమిటయ్యే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తున్నారు. ఈ జనరేషన్ ని ఆకట్టుకోవాలంటే కొత్త తరహా కథలు అయితే వర్కవుట్ అవుతాయని భావిస్తున్నాడు.