తన తండ్రి తో చేసిన సైరా ఘన విజయం సాధించటంతో మెగా పవర్ స్టార్ ..మెగా పవర్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. అదే ఊపులో ఇప్పుడు ఆయన రెండు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. రెండూ కూడా తన తండ్రితోనే చేస్తున్నారు.  అయితే అదే సమయంలో తన కుటుంబం నుంచి మరో హీరోకు ఆహ్వానం పలుకుతున్నట్లు సమాచారం.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ ఈ మధ్యలో మరో సినిమా నిర్మించబోతున్నారు. అది తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో అని తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ..మాట ఇచ్చాడని, నువ్వే నీ తమ్ముడుని ఇంట్రడ్యూస్ చేయాలని అడిగాడని చెప్పుకుంటున్నారు.  ప్రస్తుతం అకిరా ..నటనకు సంభందించిన ట్రైనింగ్, డాన్సింగ్, ఫైట్స్ నేర్చుకోవటంలో బిజీగా ఉన్నారు.

అలాగే అకీరా తల్లి రేణు దేశాయ్ తన కుమారుడుకు నటన నేర్పిస్తోందిట. ఎవరెన్ని నేర్పించినా తన జీన్స్ లో ఉన్న నటననే ఫాలో అయ్యి మరో మెగా హీరోగా అవతరిస్తాడంటున్నారు మెగాభిమానులు. అయితే ఈ సినిమా ఏ దర్శకుడుతో సినిమా అనేది తెలియరాలేదు. కొన్ని కథలు విని ఓ యంగ్ డైరక్టర్ తో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారని చెప్తున్నారు.