మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. 2020 జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తూనే తన తండ్రి చిరంజీవి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

సైరా తర్వాత మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల  ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం గురించి చర్చలు జరిపేందుకు రాంచరణ్ తాజాగా కొరటాల శివ ఆఫీస్ ని సందర్శించాడు. ఆయనతో చర్చలు జరిగిపిన అనంతరం ఇద్దరూ కలసి ఓ అందమైన ఫోటోకు ఫోజు ఇచ్చారు. కొరటాల శివ ఆఫీసర్ ని సందర్శించడం జరిగింది. ఆయన ఆఫీస్ వాతావరణం చాలా బావుంది. చిరు 152కి ఆల్ ది బెస్ట్ అని రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

ఈ ఫొటోలో రాంచరణ్ అయ్యప్ప దీక్షలో కనిపిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా రాంచరణ్ అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అయ్యప్ప దీక్ష వస్త్రధారణలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.