రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ.. త్వరలోనే అనౌన్స్ మెంట్.. గుడ్ న్యూస్ చెప్పిన మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. గ్లోబల్ స్టార్ గా కీర్తి పొందుతున్న చెర్రీ త్వరలోనే హాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు రివీల్ చేశారు. 
 

Ram Charan Reveals Hollywood Project to be annonuced soon

RRR ‘ఆర్ఆర్ఆర్’తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.  ప్రస్తుతం ‘ఆస్కార్స్2023’ అవార్డ్స్ ల నేపథ్యంలో త్రిఫుల్ ఆర్ ప్రచార కార్యక్రమాలను అమెరికాలో జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫేమస్ టాక్ షోలు, మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా HCA వేదికపైనా సందడి చేశారు. హుందాగా వ్యహరిస్తూ అందరి ప్రశంసలు పొందారు. గ్లోబల్ స్టార్ గా ఫేమ్ దక్కంచుకున్నారు. దీంతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎప్పుడంటూ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. 

హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉంది.. ఆఫర్స్ వస్తే ఇండియన్ యాక్టర్స్ టాలెంట్ కూడా చూపిస్తామని ఇప్పటికే కామెంట్ చేసిన రామ్ చరణ్ .. త్వరలోనే తన హాలీవుడ్ ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలిపారు.  తాజాగా  అమెరికాలోని టాక్ ఈజీ (Talk Easy) పాడ్ కాస్ట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన హాలీవుడ్ ఎంట్రీపై అదిరిపోయే అప్డేట్ అందించారు చరణ్. హాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ అప్డేట్ త్వరలోనే రానుందని ఇంటర్వ్యూలో చెప్పారు.  అదేవిధంగా తనకు ఎంతో ఇష్టమైన జూలియా రాబర్ట్స్ తో నటించాలని ఉందంటూ.. ఆమె సినిమాలో గెస్ట్ రోల్ అయినా  ఇష్టమేనని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం రామ్ చరణ్  కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  త్వరలో చరణ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.  అనతి కాలంలోనే తమ అభిమాన హీరో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా  ఎదుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల్లో జరగనున్న Oscars2023 అవార్డుల ప్రదానోత్సవ వేడకకు హాజరయ్యేందుకు ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న ఆస్కార్స్ ఈవెంట్  గ్రాండ్ గా జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ సాంగ్ ఈ ప్రతిష్టాత్మకమైన  అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. 

మరోవైపు ఆస్కార్స్ వేదికపై రామ్ చరణ్, ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కూడా ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.  ఇప్పటికైతే ఆస్కార్స్ వేదికపై  Naatu Naatu సాంగ్ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ సిద్ధంగా ఉన్నారు. ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్స్ కు ఎంపికైన విషయం తెలిసిందే. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), చరణ్ స్వాతంత్ర్య సమర యోధుల పాత్రల్లో అలరించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios