మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించబోయే చిత్రం ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది ఉంది. 

ఇదిలా ఉండగా చరణ్ ప్రస్తుతం పలువురు దర్శకులు తీసుకువచ్చే కథలు వింటున్నాడట. ఇటీవల ఓ డెబ్యూ దర్శకుడు రాంచరణ్ కు కథ వినిపించగా ఆసక్తికర సంఘటన జరిగింది. సదరు దర్శకుడు వినిపించిన కథ చరణ్ కు నచ్చిందట. కానీ ఆయా కథ తనకంటే శర్వానంద్ కే బాగా సెట్ అవుతుందని రాంచరణ్ భావించాడట. 

దీనితో చరణ్ శర్వానంద్ ని రికమండ్ చేయడం, అతడు ఒకే చెప్పడం జరిగిపోయినట్లు తెలుస్తోంది. శర్వానంద్, రాంచరణ్ చిన్ననాటి నుంచి స్నేహితులు. శర్వా ఈ కథతో యువి క్రియేషన్స్ బ్యానర్ లో నటించబోతున్నాడు. త్వరలో అన్ని వివరాలు తెలియనున్నాయి.