Asianet News TeluguAsianet News Telugu

Buzz: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్ డేట్ ఇది నిజమైతే, ఫ్యాన్స్ కు షాకే

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శంక‌ర్ గ‌త సినిమాల త‌ర‌హాలోనే సామాజికాంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను...

Ram Charan-Kiara Advani Starrer Game Changer Release Date jsp
Author
First Published Nov 13, 2023, 7:45 AM IST

రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా తెరకెక్కుతోన్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ సినిమా నుంచి అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ కు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆయన ఫ్యాన్స్‌  షాక్ అవుతున్నారు. ఆ వార్త ఏమిటంటే... ఈ సినిమా ని వచ్చే సంవత్సరం దసరా 2024 కు రిలీజ్ అవుతుందని. శంకర్ వంటి టాప్ డైరక్టర్ దర్శకత్వంలో  చరణ్ చేస్తున్న మూవీ కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో  రిలీజ్ డేట్ గురించి బయిటకు రాగానే షాక్ అవుతున్నారు.

వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఓవైపు శంకర్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతోంది. దీంతో వచ్చే ఏడాది వేసవి శెలవులకు రావచ్చనీ భావించారు.కానీ ఇప్పుడు దసరా అంటూంటే ఫ్యాన్స్ కు ఏమి అనాలో అర్దం కావటం లేదు. అయితే అఫీషియల్ సమాచారం కాదు కాబట్టి కొంత ఊరటే. ఈ విడుదల తేదీపై దిల్ రాజు క్లారిటీ ఇస్తే బాగుండేది. 

ఇప్పటికే ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి ఈ దీపావళికు మొదటి పాటను విడుదల చేయనున్నారని ప్రచారం జరిగి లాస్ట్ మినిట్ లో ఆగింది. పూర్తి మాస్‌ ట్యూన్‌తో ఇది వచ్చి పండుగను ఊపేస్తుందనుకున్నారు.  ఇక ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇందులో ఓ పాట లీక్‌ కాగా నిర్మాత దిల్‌రాజు సీరియస్‌ అయ్యారు. లీక్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇక శంకర్‌ (S Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చాలా నెలల గ్యాప్ తర్వాత ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చరణ్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. రాజకీయ అంశాలతో నిండిన యాక్షన్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. అంజలి, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శంక‌ర్ గ‌త సినిమాల త‌ర‌హాలోనే సామాజికాంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌వించి ఈసినిమా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. డ్యూయ‌ల్ షేడ్స్‌లో అత‌డి క్యారెక్ట‌ర్ సాగ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విన‌య‌విధేయ రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య‌, అంజ‌లి, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. గేమ్‌ఛేంజ‌ర్ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు నిర్మిస్తోన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios